బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉన్నా కానీ సినిమా ఇంకా బెటర్ గా వసూళ్ళని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా హిందీ లో మాత్రం సినిమా ఉన్నంత లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….
సినిమా మొదటి రోజు అక్కడ హిందీ ప్లస్ తెలుగు వర్షన్ లు కలిపి 2.05 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడు రోజులు పూర్తీ అయ్యే టైం కి ఆల్ మోస్ట్ 5 కోట్ల కి చేరువ అయ్యే రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు అక్కడ మంచి జోరు చూపించగా హిందీ ప్లస్ తెలుగు రెండూ కలిపి ఆల్ మోస్ట్ 2.6 కోట్లకి దగ్గర అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా టోటల్ గా 4 రోజుల్లో హిందీ లో ఆల్ మోస్ట్…
7.6 కోట్లకి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అందులో షేర్ ఆల్ మోస్ట్ 3.75 కోట్ల దాకా సొంతం చేసుకుంది. సినిమా అక్కడ స్క్రీన్స్ ని కూడా పెంచుకోగా 5వ రోజు మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.