బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా హీరో ధనుష్ కెరీర్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతుంది. ఈ సినిమా కన్నా ముందు ధనుష్ చేసిన రాయన్ సినిమా ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు…
తన కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ ని టార్గెట్ గా కుబేర సినిమా దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో రాయన్ టోటల్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ తమిళ్ వర్షన్ ఇంకొంచం బెటర్ హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఉంది.
ఇక 4 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి రాయన్ మూవీ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే కుబేర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఆసక్తిగా మారగా తెలుగు రాష్ట్రాల వరకు కుబేర ఊచకోత మరో లెవల్ లో ఉంది, రాయన్ తమిళనాడులో మంచి ట్రెండ్ ను చూపించింది…
రాయన్ తమిళ్ లో 4 రోజుల్లో 39 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే కుబేర తెలుగు రాష్ట్రాల్లో 42.65 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కానీ కుబేర తమిళ్ లో 14.75 కోట్ల గ్రాస్ ను అందుకుంటే రాయన్ తెలుగు లో 8 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంది.
ఒకసారి 4 రోజులకు రాయన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 4 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 39.60Cr
👉Telugu States- 7.95Cr
👉Karnataka- 5.80Cr
👉Kerala – 3.20Cr
👉Hindi+ROI – 2.00Cr
👉Overseas – 24.25CR****
Total WW collection – 82.80CR(39.55CR~ Share)
ఇక 4 రోజుల్లో కుబేర టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Kuberaa 4 Days Total World Wide Collections Report
👉Telugu States – 42.65Cr
👉Tamilnadu – 14.75Cr
👉Karnataka- 6.65Cr
👉Kerala – 0.95Cr
👉Hindi+ROI – 1.90Cr
👉Overseas – 23.20CR****approx
Total WW collection – 90.10CR(45.55CR~ Share)
(69%~ Recovery)
ఓవరాల్ గా చూసుకుంటే 4 రోజుల తర్వాత కుబేర 90 కోట్ల మార్క్ ని దాటగా రాయన్ 82.8 కోట్ల గ్రాస్ ను దాటింది. ఓవరాల్ గా కుబేర లీడ్ లో ఉండగా మొదటి వారం కలెక్షన్స్ లో ఇదే లీడ్ కొనసాగితే లాంగ్ రన్ లో రాయన్ టోటల్ కలెక్షన్స్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.