లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రావు రమేష్(Rao Ramesh) నటించిన లేటెస్ట్ మూవీ మారుతీ నగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam Collections) సినిమా పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా, ఆడియన్స్ నుండి రొటీన్ గానే సినిమా ఉంది అనిపించే టాక్ వచ్చినా కూడా…
ఉన్నంతలో కామెడీ బాగానే వర్కౌట్ అవ్వడంతో కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా వీకెండ్ లో డీసెంట్ హోల్డ్ ని చూపించగా 4వ రోజు కృష్ణాష్టమి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించగా…పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా…
4.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 32 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించిన సినిమా…
ఓవరాల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి 95 లక్షల రేంజ్ లో షేర్ ని 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా…ఇక సినిమా ఓవరాల్ గా…
3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటే డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది. మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.