Home న్యూస్ 4 డేస్ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

4 డేస్ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

హాలీవుడ్ నుండి మంచి అంచనాల నడుమ పోయిన వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్(Mission Impossible: The Final Reckoning) సినిమా కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా 2 రోజుల వీకెండ్ లో మంచి జోరుని చూపించిన సినిమా…

వర్కింగ్ డేస్ కి వచ్చిన తర్వాత పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ టార్గెట్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం. మొదటి రోజు 16.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రెండో రోజున 17.50 కోట్ల నెట్ కలెక్షన్స్ తో…

రెండు రోజుల వీకెండ్ లో 34 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మంచి రచ్చ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా 3వ రోజున వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 5.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా…

4వ రోజున కూడా మరోసారి పర్వాలేదు అనిపిస్తూ లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని 5.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో జోరు చూపించింది. దాంతో టోటల్ గా 4 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా..

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 4 రోజుల్లో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక సినిమా ఇండియాలో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here