బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా కూడా ఒకటి కాగా సినిమాలో సీన్స్ వైజ్ ఆడియన్స్ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా…
జనాలు మాత్రం అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి అయితే తరలిరాలేదు అనే చెప్పాలి. దాంతో కలెక్షన్స్ పరంగా 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
4వ రోజున 9.5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో మాత్రం కొంచం పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించగా 71 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది.
దాంతో టోటల్ గా 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Odela2 Movie 4 Days Total WW Collections(inc GST)
👉Nizam: 92L~
👉Ceeded: 35L
👉Andhra: 1.14CR~
AP-TG Total:- 2.41CR(4.75CR~ Gross)
👉Ka+ROI+OS – 36L~
Total WW Collections – 2.75CR(5.80R~ Gross)
ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 8.2 కోట్లకు పైగానే షేర్ ని అందుకోవాల్సి ఉంది, నాన్ థియేట్రికల్ రైట్స్ తో మేకర్స్ కి టేబుల్ ప్రాఫిట్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఇంకా చాలా దూరం సినిమా వెళ్ళాల్సిన అవసరం ఉంది.