బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో మే 1 వీకెండ్ లో అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన సూపర్ హిట్ రైడ్ మూవీ కి సీక్వెల్ అయిన రైడ్2(Raid2 Movie) గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా వీకెండ్ లో సాలిడ్ జోరుని చూపించి వీర లెవల్ లో కుమ్మేసింది….
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గత నెలలో పెద్దగా జోరు చూపించిన సినిమాలు రాలేదు, ఆ లోటుని బర్తీ చేస్తూ అజయ్ దేవగన్ రైడ్2 మూవీ సాలిడ్ రివ్యూలను సాలిడ్ కలెక్షన్స్ తో లాంగ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించడం విశేషం అని చెప్పాలి..
సినిమా మొదటి రోజున 19.71 కోట్లు, రెండో రోజు 13.05 కోట్లు, మూడో రోజు 18.55 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో సాలిడ్ గా ఊచకోత కోస్తూ 22.52 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది…
దాంతో ఓవరాల్ గా 4 రోజుల వీకెండ్ లో సినిమా హిందీ లో 73.83 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ జోరుని చూపించింది. సినిమా హిందీ లో క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 130 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
అందుకోవాల్సిన అవసరం ఉంటుందని అంచనా…ఈ లెక్కన సినిమా లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. సినిమా వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా కూడా లాంగ్ రన్ లో 150 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.