టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇతర సినిమాలతో పోటి ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని అందుకోగా…
ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా డీసెంట్ హోల్డ్ నే చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద 4వ రోజున వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని 40 లక్షలకు పైగా గ్రాస్ ను అందుకున్న సినిమా…
నార్త్ అమెరికాలో $160K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి అక్కడ మంచి రచ్చ చేసింది… ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 4వ రోజున సినిమా 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 55 లక్షలకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని మంచి హోల్డ్ నే చూపించింది..
దాంతో టోటల్ గా ఇప్పుడు 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Subham Movie 4 Days Total WW Collections Report(est)
👉Nizam: 63L~
👉Total AP: 82L~
AP-TG Total:- 1.45CR(2.85CR~ Gross)
👉KA+ROI+OS : 0.78CR****approx
Total WW Collections: 2.23CR(Gross – 4.55CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.8 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉండగా…సినిమా ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తే లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.