బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలకే సరైన కలెక్షన్స్ అప్పుడప్పుడు రావడం లేదు, అలాంటిది టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ గా మారిన రీ రిలీజ్ మూవీస్ లు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…
ఇప్పటి వరకు స్ట్రైట్ మూవీస్ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయిన ఓల్డ్ డబ్బింగ్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది.. కోలివుడ్ స్టార్ హీరో సూర్య(SURIYA) నటించిన 2008 టైం నాటి సినిమా అయిన…
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్(Surya Son Of Krishnan) మూవీ ఆడియన్స్ ముందుకు 15 ఏళ్ల తర్వాత రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయగా సుమారు 550 వరకు షోలతో రిలీజ్ అయిన ఈ సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం.
సినిమా మొత్తం మీద ఫస్ట్ డే 1.4 కోట్లు, రెండో రోజు 55 లక్షలు, మూడో రోజు 55 లక్షల రేంజ్ లో గ్రాస్ తో ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా 4వ రోజు అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని టోటల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.70 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 2.75 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా అలాగే డబ్బింగ్ మూవీస్ లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి ఊచకోత కోసింది.