నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే అంచనాలకు మించి కలెక్షన్స్ ప్రహావం సృష్టిస్తూ దూసుకు పోతుంది, ప్రతీ రోజు అంచనాలను మించి వసూళ్లు సాధిస్తున్న అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నాలుగో రోజు మరో సారి రచ్చ చేసింది. ఆ రచ్చ సండే అడ్వాంటేజ్ తో నెక్స్ట్ లెవల్ మాస్ అనిపించేలా దుమ్ము దుమారం లేపడం విశేషం.
సినిమా అన్ని సెంటర్స్ లో ఈ రోజు బ్యాటింగ్ ఆల్ మోస్ట్ ఫస్ట్ డే ని మరిపించే లెవల్ లో ఉందంటే ఏ రేంజ్ లో ఊచకోత కోస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ డే తర్వాత ఈ రేంజ్ లో ఫుల్స్ పడటం, ఫ్యామిలీస్ ఎగబడి థియేటర్స్ కి రావడం…
మామూలు మాస్ కాదు… సినిమా సీడెడ్ ఏరియాలో ఈ రోజు ఆల్ మోస్ట్ ఛాన్స్ దొరికిన ప్రతీ థియేటర్ లో ప్రదర్శించారని సమాచారం. వేరే సినిమాల మీద జనాల ఆసక్తి పెద్దగా లేక పోవడంతో అఖండ ఒక్కటే ఆడియన్స్ ముందు ఛాయిస్ అవ్వగా ఆ అడ్వాంటేజ్ ను 4 వ రోజు ఓ రేంజ్ లో…
వాడుకుంటున్న అఖండ ఇప్పుడు అంచనాలను మించి కలెక్షన్స్ ని 4వ రోజు సొంతం చేసుకోబోతుంది. సినిమా 4వ రోజు మార్నింగ్ షోలకు 3 వ రోజు తో పోల్చితే 5-10% డ్రాప్ అయినా మ్యాట్నీ షో నుండి దంచికొట్టడం మొదలు పెట్టి డ్రాప్స్ ను కవర్ చేసి గ్రోత్ ని చూపెట్టి దుమ్ము లేపగా ఇప్పుడు కలెక్షన్స్ 7 కోట్ల రేంజ్ లో ఉండటం…ఆల్ మోస్ట్ కన్ఫాం అనిపించుకున్న అఖండ…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి జోరు ని కంటిన్యూ చేసేలా ఉండటంతో 8 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అంతకుమించి కలెక్షన్స్ వస్తే ఇది మాస్ యుఫోరియా అనే చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా 4 వ రోజు సినిమా 8.5 కోట్ల రేంజ్ వసూళ్లు మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉంది. ఇక అఫీషియల్ లెక్క తొలి 3 రోజుల మాదిరిగా మించుతుందో లేదో చూడాలి ఇక.