Home న్యూస్ అఖండ@డే 4 ఓపెనింగ్స్…ఈ రోజు విద్వంసం ఖాయం!!

అఖండ@డే 4 ఓపెనింగ్స్…ఈ రోజు విద్వంసం ఖాయం!!

2894
0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది. ఈ రేంజ్ లో బ్యాటింగ్ ని బాలయ్య కెరీర్ లో రీసెంట్ టైం లో సొంతం చేసుకున్న సినిమా ఇదే అవ్వగా సినిమా మూడో రోజు కూడా ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు నాలుగో రోజులో ఎంటర్ అయింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా నాలుగో రోజు మరింత సాలిడ్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 5% టు 10% వరకు మాత్రమే డ్రాప్స్ ను….

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ జోరు యమ సాలిడ్ గా కొనసాగుతున్న నేపధ్యంలో ఈ రోజ కూడా బాక్స్ ఆఫీస్ విద్బంసం ఖాయమని చెప్పొచ్చు. నాలుగు రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపబోతుంది.

ప్రజెంట్ ట్రెండ్ ని చూస్తుంటే సినిమా మరో సారి అవలీలగా 5.5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ కూడా సాలిడ్ గా ఉండటం ఖాయంగా కనిపిస్తున్న నేపధ్యంలో అవలీలగా 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండనిపిస్తుంది.

ఇక మొదటి మూడు రోజుల మాదిరిగా నాలుగో రోజు కూడా సినిమా అంచనాలను మించే అవకాశం కూడా ఎంతైనా ఉన్న నేపధ్యంలో రోజు ముగిసే సరికి ఫైనల్ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి. నాలుగో రోజు చాలా కొన్ని సినిమాలే 7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకున్నాయి, ఇప్పుడు అఖండ కూడా ఆ లిస్టులో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here