బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 4వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఓవరాల్ గా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా సినిమా కొంచం ఎక్కువగానే డ్రాప్ అయింది.
మొత్తం మీద 4వ రోజు సినిమా 60% టు 65% రేంజ్ లో డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఉండగా మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ఉంది కానీ సినిమా ఈ రోజు మొత్తం మీద ఇప్పుడు….
సినిమా 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్సీడ్ అయితే సినిమా 1.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.8 కోట్ల నుండి 2 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 4 రోజుల్లో అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….