బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ముగించింది. సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది…
ఇక 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి మొత్తం మీద 50% టు 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. కొన్ని చోట్లా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉన్నా కానీ ఓవరాల్ గా….
హాలిడే నుండి వర్కింగ్ డే కి వచ్చే సరికి ఇలాంటి డ్రాప్స్ కామన్ అని చెప్పాలి. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి బుకింగ్స్ పర్వాలేదు అనిపించేలా సాగుతున్నాయి అని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా…
5.50 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి ఆక్యుపెన్సీ బాగుండి మంచి గ్రోత్ ని చూపిస్తే సినిమా 6.5 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని, కానీ సినిమా మొదటి 3 రోజుల మాదిరిగా అంచనాలను మించి పోయి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే….
ఊరమాస్ అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి అంచనాలను అందుకుంటుందా లేక అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి ఇక…