బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వీకెండ్ కుమ్మేసిన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది ఇప్పుడు… సినిమా మూడో రోజు సాధించిన సెన్సేషనల్ గ్రోత్ తర్వాత వర్కింగ్ డే లో డ్రాప్స్ హేవిగా ఉన్నా కానీ సగం వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ…
ఈ రోజు సాధించే కలెక్షన్స్ కూడా టాలీవుడ్ లో 4 వ రోజు వర్కింగ్ డే లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనే చెప్పాలి. సినిమా మార్నింగ్ అండ్ నూన్ షోల టైం కి ఆల్ మోస్ట్ 55% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్….
అంతంత మాత్ర్రమే ఉన్నాయని చెప్పాలి. కొన్ని చోట్ల ఫుల్స్ పడినా కానీ సినిమా ఓవరాల్ గా హాలిడే తర్వాత వర్కింగ్ డే డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి. సినిమా మొత్తం మీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉండేలా ఉన్నాయి కాబట్టి 7 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక హిందీలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో కర్ణాటకలో కూడా బాగా హోల్డ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే…
అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 4 వ రోజు వర్కింగ్ డే లో కూడా 10 కోట్ల రేంజ్ షేర్ అంటే అల్టిమేట్ అనే చెప్పాలి. మరి సినిమా అఫీషియల్ గా సినిమా 4 వ రోజు ఈ మార్క్ ని అందుకుంటుందా లేక అంతకన్నా మించి ముందుకు వెళుతుందో చూడాలి. అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.