ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా రెండో రోజు మూడో రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని రికార్డులను కూడా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు వర్కింగ్ డే టెస్ట్ లో….
ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా, వీకెండ్ తర్వాత వర్కింగ్ డే కి డ్రాప్స్ కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 3 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 50% నుండి కొన్ని చోట్ల 55% వరకు…
డ్రాప్స్ ఉన్నాయని చెప్పాలి. హాలిడే తర్వాత వర్కింగ్ డే లో ఇలాంటి డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి. సినిమా 3 వ రోజే అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించగా అందులో డ్రాప్స్ సగం వచ్చినా కానీ ఈ రోజు మాస్ రాంపేజ్ అనే చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర… కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా…
డ్రాప్స్ ఉన్న కారణంగా సినిమా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ని బట్టి చూస్తుంటే ఈ రోజు 6 కోట్ల రేంజ్ షేర్ అయితే కచ్చితంగా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించే గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
సినిమా 6.5 కోట్ల నుండి 7 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఇక సినిమా ఇతర రాష్ట్రాలలో కూడా బాగానే హోల్డ్ చేయగా హిందీ లో బాగా ట్రెండ్ అవుతుంది. దాంతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఈ రోజుకి గాను 8-9 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి నైట్ షోల టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి.