బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 4 వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా టికెట్ హైక్స్ తగ్గించినా ఇప్పటికీ రీసెంట్ మూవీస్ అన్నింటి కన్నా కూడా రేట్లు ఎక్కువే ఉండటం తో కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నాయి, అయినా కానీ సినిమాకి భారత్ బంద్ అడ్వాంటేజ్ కొద్ది వరకు కలిసి వచ్చింది అని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో…
మ్యాట్నీ షోల నుండి సినిమా మంచి హోల్డ్ తోనే పరుగును కొనసాగించగా సినిమా కి నాలుగో రోజు కూడా బిగ్గెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల నుండి 16 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కొంచం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ముందు అనుకున్నట్లే 15 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా కర్ణాటక మరియు ….
తమిళనాడులలో కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కానీ కేరళలో భారత్ బంద్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ చాలా చోట్లా క్లోజ్ చేసినట్లు సమాచారం, కానీ కొన్ని చోట్లా థియేటర్స్ ని ఓపెన్ గానే ఉంచారు, భారత్ బంద్ వలన మార్జింగ్ షోలకు దెబ్బ పడటం అలాగే వర్కింగ్ డే వలన డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా…
ఇప్పుడు నాలుగో రోజు వరల్డ్ వైడ్ గా 33 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే భారత్ బంద్ ఇంపాక్ట్ లేని చోట్ల కలెక్షన్స్ లెక్కలను బట్టి సినిమా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఓవరాల్ గా 4 వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.