Home న్యూస్ సాహో@డే 4 కలెక్షన్స్….మళ్ళీ కొట్టాడు సామి!!

సాహో@డే 4 కలెక్షన్స్….మళ్ళీ కొట్టాడు సామి!!

1999
0

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో హోరేత్తించింది, ట్రేడ్ లెక్కల్లో 140 కోట్లకు పైగా షేర్ ని 260 కోట్ల లోపు గ్రాస్ ని వసూల్ చేయగా నిర్మాతల లెక్కల్లో ఏకంగా 294 కోట్ల గ్రాస్ ని మూడు రోజుల్లో అందుకుంది, అంటే మూడో రోజు వారి లెక్కల్లో ఏకంగా 90 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు లెక్క. 

ఇక నాలుగో రోజు వినాయక చవితి హాలిడే ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరో సారి జోరు చూపింది, నైజాం ఏరియా మిగిలిన ఏరియాల కన్నా ఫుల్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా మాస్ సెంటర్స్ లో జోరు తగ్గింది, అయినా కానీ సినిమా నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో…

7 కోట్ల నుండి 7.5 కోట్ల వరకు షేర్ ని సాధించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి, ఇక హిందీ లో కూడా వినాయక చవితి పూజ వలన కొద్దిగా డౌన్ అయినా 12 కోట్ల కి పైగా నెట్ కలెక్షన్స్ ని 4 వ రోజు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక కన్నడ లో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా తమిళ్ అండ్ కేరళలో మరింత స్లో డౌన్ అవుతూ వస్తుంది, ఇక ఓవర్సీస్ లో అమెరికా లో 2 మిలియన్ ని క్రాస్ చేయగా మిగిలిన చోట్ల కూడా సినిమా మంచి వసూళ్ళనే సాధిస్తుంది.

మొతం మీద 4 వ రోజు మరోసారి వరల్డ్ వైడ్ గా 15 కోట్ల నుండి 17 కోట్ల రేంజ్ లో షేర్ ని 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఏరియాల వారి లెక్కలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here