బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఫస్ట్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఫినిష్ చేయడానికి సిద్ధం అవుతుంది, ఆదివారం అవ్వడంతో సినిమా మరోసారి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఆక్యుపెన్సీ సాలిడ్ గా కొనసాగుతున్న సినిమా నైజాంలో మల్టిప్లెక్సులలో జోరు చూపించిన సినిమా సింగిల్ స్క్రీన్స్ లో ఆక్యుపెన్సీ బాగున్నాయి…
ఇక ఆంధ్రలో ఎక్స్ లెంట్ జోరు చూపిస్తున్న సినిమా సీడెడ్ లో పర్వాలేదు అనిపించుకుంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 10 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా జోరు చూస్తుంటే రెండో రోజు లెవల్ లో…
కలెక్షన్స్ ని దక్కించుకోవడానికి అవకాశం ఉంది, మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10.5 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా బాగుంటే సొంతం చేసుకునే అవాకాశం ఉంది, మరి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో ఉండయో చూడాలి. లెక్క కనుక ఇంకా ముందుకు వెళితే ఊహకందని రాంపేజ్ అనే చెప్పాలి.