మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి మూడు రోజుల్లో 77 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా 55 కోట్లకు పైగా షేర్ ని అందుకుని వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు లో ఎంటర్ అవ్వగా సినిమా…
అసలు సిసలు వీకెండ్ ని మొదలు పెట్టింది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, 3 వ రోజు తో పోల్చితే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ కేవలం 20% రేంజ్ లోనే ఉండటం తో సినిమా ట్రెండ్ గ్రోత్ వైపు వెళుతుంది అని తేలిపోయింది.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి గ్రోత్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పుంజుకుంటున్నాయి. దాంతో సినిమా నాలుగో రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి 6 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి.
కానీ గ్రోత్ పెరుగుతూ పోతుంది కాబట్టి రోజు ముగిసే సరికి అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6.5 కోట్ల కి పైగా నే షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అంటే 3 వ రోజు తో పోల్చితే 5 టు 8% డ్రాప్స్ మాత్రమె అన్నట్లు… ఇక తెలుగు లో ఎంత సాలిడ్ గా ఉన్నా…
హిందీ, తమిళ్ కేరళ ఏరియాల్లో మంచి రివ్యూ లు ఉన్నా సినిమా గ్రోత్ అస్సలు లేదు, దాంతో అక్కడ ఈ రోజు యావరేజ్ కలెక్షన్స్ కూడా రావడం కష్టమే అంటున్నారు, ఉన్నంతలో కన్నడ లో అలాగే ఓవర్సీస్ లో కొంచం బెటర్ కలెక్షన్స్ ని సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పాలి, రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.