నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు 4 వ వారంలో అడుగు పెట్టింది. కాగా సినిమా మొదటి మూడు వారాల రేంజ్ లో ఇప్పుడు మూడో వారంలో థియేటర్స్ ని హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా మొదటి వారంలో 915 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా… రెండో వారంలో 215 థియేటర్స్ ని కోల్పోయి మొత్తం మీద…
700 వరకు థియేటర్స్ లో రన్ అవ్వగా తర్వాత మూడో వారానికి వచ్చే సరికి సినిమా పుష్ప వలన థియేటర్స్ చాలా కోల్పోయింది. సినిమా మూడో వీక్ ని ఆల్ మోస్ట్ 290 థియేటర్స్ లో కొనసాగించగా ఇప్పుడు నాలుగో వారంలో ఎంటర్ అయిన సినిమా ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాలలో నాలుగో వారంలో ఓవరాల్ గా 230 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ కన్సిస్టంట్ గా థియేటర్స్ ని హోల్డ్ చేయడం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నాలుగో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..