Home న్యూస్ తమిళ్ లో 4వ వారంలో కల్కికి పెరిగిన థియేటర్స్….ఇదేం రన్ రా బాబు!!

తమిళ్ లో 4వ వారంలో కల్కికి పెరిగిన థియేటర్స్….ఇదేం రన్ రా బాబు!!

0
Prabhas Kalki 2898 AD Tamilnadu 4th Week Theaters Count
Prabhas Kalki 2898 AD Tamilnadu 4th Week Theaters Count

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 3 వారాలను పూర్తి చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా తెలుగులో హిందీలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా… ఓవర్సీస్ మార్కెట్ లో సైతం…

రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని అందుకోగా తమిళ్ లో కేరళ లాంటి ఏరియాల్లో ఊహించిన దాని కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి సంచలనం సృష్టించింది… కాగా సినిమా మూడో వారంలో కోలివుడ్ ఈ ఇయర్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా రిలీజ్ ను సొంతం చేసుకున్న భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా రిలీజ్ అవ్వడంతో…

కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అవ్వగా భారతీయుడు2 మూవీకి ఆడియన్స్ నుండి భారీగా మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వడంతో అక్కడ థియేటర్ ఓనర్స్ తిరిగి కల్కి మూవీని థియేటర్స్ లో ప్రదర్శించడం మొదలు పెట్టారు….వర్కింగ్ డేస్ లో భారతీయుడు2 కి డెఫిసిట్ లు కూడా పడగా…

3వ వారంలో కొంచం స్లో అయినా కూడా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటున్న కల్కినే ప్రదర్శించడానికి మొగ్గు చూపగా మొత్తం మీద మూడో వారంలో కొన్ని చోట్ల భారతీయుడు2 ని తీసేసి మరి కల్కిని వేయగా ఇప్పుడు 4వ వారంలో అడుగు పెట్టిన కల్కి మూవీకి…

థియేటర్స్ ని పెంచారు తమిళ్ లో…ఓవరాల్ గా మూడో వారంలో 120 వరకు థియేటర్స్ లో రన్ అయిన సినిమా ఇప్పుడు 4వ వారంలో ఏకంగా 80వరకు థియేటర్స్ ని పెంచగా మొత్తం మీద 200 వరకు థియేటర్స్ లో సినిమా ఇప్పుడు 4వ వారంలో తమిళ్ లో రన్ ని కొనసాగిస్తుంది…

దాంతో కలెక్షన్స్ పరంగా ఈ వీకెండ్ లో భారతీయుడు2 కి ధీటుగా కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మరో వారం ధనుష్(Dhanush) రాయన్(Raayan Movie) వచ్చే వరకు కల్కి హవా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here