Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 4th వీక్ TRP రేటింగ్…సాలిడ్ హోల్డ్!

ఎవరు మీలో కోటీశ్వరులు 4th వీక్ TRP రేటింగ్…సాలిడ్ హోల్డ్!

1308
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు, లాంచ్ ఎపిసోడ్ నుండే రచ్చ చేయడం మొదలు పెట్టిన ఈ షో, ఇది వరకు సీజన్స్ కంప్లీట్ గా ఫ్లాఫ్ అవ్వగా తర్వాత జెమినీ టీవీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కానీ తెలుగు లో షోల పరంగా మినిమం ఇంపాక్ట్ ని చూపలేక పోతున్న జెమినీ టీవీ వాళ్ళకి ఊపిరి పోస్తూ ఎన్టీఆర్ ఈ షో ని…

సాలిడ్ TRP రేటింగ్ లతో రన్ అయ్యేలా చేస్తున్నాడు. మొదటి వారంలో 6.76 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో, రెండో వారంలో 6.48 రేటింగ్ ను దక్కించుకుంది. ఇక మూడో వారంలో రెట్టించిన జోరు చూపెట్టిన ఈ షో ఏకంగా 7.3 రేటింగ్ తో…

ఆల్ టైం రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు నాలుగో వారం రేటింగ్ లు వచ్చాయి. ఈ సారి 3 వ వారం తో పోల్చితే ఈ షో కొంచం తగ్గినా ఓవరాల్ గా చూసుకుంటే సాలిడ్ గా హోల్డ్ చేసి దూసుకు పోతుంది అని చెప్పాలి. 4 వ వారానికి గాను ఎవరు మీలో కోటీశ్వరులు షో కి….

6.59 రేటింగ్ ఓవరాల్ గా సొంతం అయ్యింది, మూడో వారంతో పోల్చితే కొంచం రేటింగ్ లు తగ్గాయి కానీ ఈ షో కి ప్రీవియస్ సీజన్స్ లో చాలా తక్కువ రేటింగ్ లు వచ్చేవట. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్ గా సాలిడ్ రేటింగ్ లతో ఈ షో హోల్డ్ చేసి రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రీవియస్ వీక్ తో పోల్చితే…

జెమినీ టీవీ GDP పాయింట్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడం విశేషం, మొత్తం మీద ఛానెల్ పొజిషన్ 4 వ ప్లేస్ నుండి పెద్దగా గ్రోత్ లేదు కానీ ఇది వరకటితో పోల్చితే వ్యూవర్ షిప్ ఇంప్రూవ్ మెంట్ బాగా జరిగింది అని చెప్పొచ్చు. ఇక 5 వ వారంలో సెలబ్రిటీ ల రేటింగ్ లు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here