బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ అయిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఎట్టకేలకు 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపెడుతుంది.
సినిమా నైజాంలో మరో సారి 3వ రోజుకి సిమిలర్ గా కొంచం అటూ ఇటూగా ట్రెండ్ అవుతున్నా కూడా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలలో మాత్రం మంచి గ్రోత్ నే చూపిస్తూ దూసుకు పోతుంది. ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో 20% రేంజ్ లో గ్రోత్ కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా బెటర్ గా ఉండే అవకాశం ఉంది.
ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.2 కోట్ల రేంజ్ నుండి 5.50 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించిపోతే ఈ రేంజ్ కి మించి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా ఇక వరల్డ్ వైడ్ గా…
4వ రోజున 6.5 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, మొత్తం మీద ఈ రోజు బాలయ్య మంచి జోరుని చూపెడుతూ ఉండగా ఇక టోటల్ గా 4 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక అంచనాలను మించుతాయో చూడాలి ఇక.