బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని అయితే చూపించింది కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా…
ఇంకా బెటర్ గా ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇక వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా… మొత్తం మీద సినిమా 3వ రోజుతో పోల్చితే..
4వ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే 60% రేంజ్ కి అటూ ఇటూగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల కూడా డ్రాప్స్ ఇదే రేంజ్ లో ఉన్నాయి…దాంతో ఓవరాల్ గా సినిమా….
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 60-65 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా..
70-75 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా అందుకునే అవకాశం ఉండగా, సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది అని చెప్పడానికి మినిమమ్ 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని 4వ రోజున అందుకోవాల్సి ఉంటుంది. మరి అఫీషియల్ గా సినిమా ఎంతవరకు 4 రోజుల్లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.