బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన బ్రహ్మాస్త్ర సినిమా ఇప్పుడు 4వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయింది. తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ లోనే దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా వర్కింగ్ డే కి వచ్చే సరికి అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ నే ఇప్పుడు సొంతం చేసుకుంది అని చెప్పాలి. డే 3 తో పోల్చితే డే 4….
ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా కొన్ని చోట్ల 55% వరకు డ్రాప్స్ ఉన్నాయి. దాంతో సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 90 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక హిందీ లో ఈ రోజు సినిమా 15-16 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
మొత్తం మీద చూసుకుంటే హిందీ లో సినిమా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించగా తెలుగు తో పాటు ఇతర రాష్ట్రాల్లో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది. సినిమా ఇక మేజర్ కలెక్షన్స్ హిందీ నుండే సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టోటల్ 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.