మొదటి వీకెండ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా వీకెండ్ లోనే ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…ఇక సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా ఎలాంటి హోల్డ్ ని చూపించింది అన్నది..
ఆసక్తిగా మారగా సినిమా ఉన్నంతలో వర్కింగ్ డే లో ఒక పక్క పరీక్షల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మంచి హోల్డ్ నే చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద సండే తో పోల్చితే మండే సినిమా డ్రాప్స్ పరంగా ఆల్ మోస్ట్ 55-60% రేంజ్ లో.
డ్రాప్స్ అయితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఉండగా…ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ అవుతూ ఉండగా…ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున 80-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా కోటి రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరో పక్క హిందీ వర్షన్ వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా…
తెలుగు వర్షన్ తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి పోయే రేంజ్ లో జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక మొత్తం మీద 4వ రోజు సినిమా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తుందో లేక ఇంతకి మించి దుమ్ము లేపుతుందో చూడాలి ఇప్పుడు.