Home న్యూస్ హిట్3 @ DAY-4 కలెక్షన్స్….నాని సెన్సేషనల్ మాస్ రాంపెజ్!!

హిట్3 @ DAY-4 కలెక్షన్స్….నాని సెన్సేషనల్ మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో ఓవరాల్ గా 79% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల ఆవల ఇంకా బెటర్ ట్రెండ్ నే చూపెడుతూ ఉండటం మాస్ అనే చెప్పాలి..

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి మంచి జోరుని చూపెడుతూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే మూడో రోజు కి సిమిలర్ గానే ఓపెన్ అయినా కొన్ని మేజర్ సెంటర్స్ లో గ్రోత్ ని కూడా టికెట్ సేల్స్ లో చూపిస్తూ ఉన్న సినిమా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఇదే ట్రెండ్ ను చాలా సెంటర్స్ లో కొనసాగించింది అని చెప్పాలి. కానీ నైజాంలో నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో ఈ రోజు ట్రెండ్ కొంచం బెటర్ గానే ఉన్నట్లు తెలుస్తూ ఉండటంతో మొత్తం మీద సినిమా…

NANI Hit3 Movie WW Pre Release Business!!

4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా… ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా మరోసారి…

మంచి జోరునే చూపెడుతూ ఉండగా అన్నీ కలిపి 2.8-3 కోట్ల రేంజ్ లో షేర్ ని ఈ రోజున సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగో రోజు ఇప్పుడు 9 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది….

ఓవరాల్ గా సినిమా ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుంది…రెండు నెలలుగా చాలా చప్పగా సాగిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి తిరిగి ఊపిరి పోసిన సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక టోటల్ గా 4 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Nani Hit3 Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here