బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మూడో రోజు కొంచం డౌన్ అయింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ పరంగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ కుమ్మేసినా ఆఫ్ లైన్ లో కొంచం డౌన్ అవ్వగా కలెక్షన్స్ అంచనాలను మొదటి 2 రోజుల రేంజ్ లో మించలేదు కానీ ఉన్నంతలో…
బాగానే హోల్డ్ ని చూపించి మంచి రికవరీ తో దుమ్ము లేపుతూ ఉండగా ఇక ఇప్పుడు నాలుగో రోజున సండే అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ సెంటర్స్ లో మరోసారి మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో…
బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ డే 2 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా కొన్ని చోట్ల మంచి గ్రోత్ నే చూపెడుతూ ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…
క్రికెట్ మ్యాచుల ఇంపాక్ట్ కొంచం తక్కువ ఉండి అనుకున్న రేంజ్ లో గ్రోత్ కనుక ఉంటే నాలుగో రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
అంచనాలను మించితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ రోజు మంచి ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో ఈ రోజు కొంచం తగ్గే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర..
డే 3 రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా మంచి గ్రోత్ ని చూపిస్తే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో మాస్ కలెక్షన్స్ జాతర సృష్టించబోతుంది అని చెప్పాలి.