బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా ఊహకందని రాంపెజ్ ను చూపించింది. ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఆల్ రెడీ..
టికెట్ సేల్స్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా ప్రీవియస్ రికార్డులను అన్నింటినీ లాంగ్ రన్ లో బ్రేక్ చేసింది. ఓవర్సీస్ లో కూడా కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఇక వర్కింగ్ డే లో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ..
పరుగును కొనసాగిస్తూ అప్ కమింగ్ టాలీవుడ్ రీ రిలీజ్ లకు ఊహకందని టార్గెట్ ను సెట్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. మొత్తం మీద సండే తో పోల్చితే మండే ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా..
మొత్తం మీద మేజర్ సెంటర్స్ లో డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం, ముఖ్యంగా నైజాంలో హోల్డ్ బాగుండటంతో మొత్తం మీద 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 22-25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా..
ఆఫ్ లైన్ లెక్కలు కొంచం బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా సాలిడ్ రికార్డులతో దుమ్ము లేపుతూ ఉండగా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి జోరు ని చూపెడుతుందో చూడాలి.