కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా వీకెండ్ లో వీర విహారం చేసి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా 4వ రోజు ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఒక్క తమిళనాడులో మాత్రం భారీగా హెవీగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
తెలుగులో మాత్రం సినిమా మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా సండే తో పోల్చితే మండే కి వచ్చేసరికి లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది. ఆల్ మోస్ట్ 55-60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా…
మంచి హోల్డ్ కొనసాగుతుంది. దాంతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4వ రోజున 3 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక తమిళనాడులో 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో షేర్ ని అందుకుంటూ ఉండగా ఓవరాల్ గా నాలుగో రోజు వరల్డ్ వైడ్ గా….
5 కోట్ల రేంజ్ నుండి 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది..ఇక ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క 6 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. ఇక సినిమా మండే టేస్ట్ ను బాగా పాస్ అయింది అని చెప్పడానికి 6.5 కోట్లు…
ఆ పైన షేర్ ని అందుకుంటే సాలిడ్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక టోటల్ గా 4 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…