బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకుని మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి…
మాస్ రచ్చ చేసిన సినిమా సాలిడ్ రికవరీని అందుకోగా ఇక సినిమా వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపెడుతుంది.
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా ఆల్ మోస్ట్ 55-60% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపించగా తమిళనాడులో మాత్రం సినిమా ఏకంగా 70% కి పైగా…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి గ్రోత్ ని చూపిస్తే 3 కోట్ల రేంజ్ కి…
అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తమిళనాడులో మాత్రం సినిమా హెవీ డ్రాప్స్ తో 1.5-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతున్న సినిమా…
వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 4వ రోజున 5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని టార్గెట్ చేసిందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా మంచి హోల్డ్ ని కనుక చూపెడితే షేర్ ఇంకా పెరగవచ్చు. ఇక సినిమా 4వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.