ఆల్ టైం ఎపిక్ ఇండియన్ రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, మూడు రోజుల్లో అల్లకల్లోలం సృష్టించిన తర్వాత నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు…
తెలుగులో రెండు మూడు రోజుల్లో చూపించాల్సిన రేంజ్ జోరుని చూపించ లేక పోయిన సినిమా నాలుగో రోజు రచ్చ చేస్తుంది. నైజాం అండ్ సీడెడ్ లు స్ట్రాంగ్ హోల్డ్ ని కొనసాగించగా రెండు మూడు రోజుల్లో డౌన్ అయిన ఆంధ్రలో ఈ రోజు సినిమా సాలిడ్ గా జోరు చూపిస్తూ ఉంది…
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 24-26కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కూడా కుమ్మేస్తే 27కోట్లు ఆ పైన షేర్ ని అందుకోవచ్చు. ఇక హిందీలో సినిమా రాంపెజ్ అక్కడ చరిత్రలో…
నిలిచిపోయే రేంజ్ లో ఉండగా హిందీ నుండే ఈ రోజు మరోసారి అవలీలగా 37-39 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా ఇక్కడ…
మరోసారి 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో మరోసారి 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కేరళలో మాత్రం సినిమాకి దెబ్బ పడింది. ఓవర్సీస్ లో మరోసారి కుమ్మేస్తూ ఈ రోజు 2.6-3 మిలియన్ డాలర్స్ రేంజ్ లో జోరుని…
మరోసారి చూపించే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 4 రోజున సినిమా ఊహకందని రేంజ్ లో 87-89 కోట్ల రేంజ్ లో రికార్డ్ షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ఊహకందని రికార్డులతో వీకెండ్ ని కంప్లీట్ చేసుకోబోతుంది సినిమా…ఇక అఫీషియల్ 4 డేస్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.