బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్న కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…కానీ లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఎంతో కొంత బెటర్ గానే హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా..
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా సాలిడ్ గా జోరు ని చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మూడో రోజు కొంచం గ్రోత్ ని చూపించగా నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో ఉన్నంతలో మరోసారి తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో….
పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను అయితే చూపెడుతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ డే 3 సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల రేంజ్ నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి..
ఇక సినిమా తమిళనాడులో ఈ రోజు 7 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కొద్ది వరకు ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉండటంతో టోటల్ వరల్డ్ వైడ్ గా…
4వ రోజున సినిమా 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. కానీ సినిమా బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి 20 కోట్లకు పైగా నే గ్రాస్ ను అందుకోవాలి. ఇక టోటల్ గా 4 రోజుల సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.