బాక్స్ ఆఫీస్ దగ్గర 5 ఏళ్ళుగా క్లీన్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకోవాలి అనుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా…
టార్గెట్ కి ఇంకా చాలా దూరంలో ఆగిపోగా 4వ రోజున సినిమాకి రంజాన్ పండగ అడ్వాంటేజ్ కలిసి వచ్చిన కూడా అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ కనిపించడం లేదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా మొత్తం మీద ట్రాక్ చేసిన…
సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు…
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోతున్న సినిమా ఓవరాల్ గా 4వ రోజున వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ నుండి అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 1 కోటి రేంజ్ లో షేర్ మార్క్ ని…..
అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా ఇక తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు అనే చెప్పాలి…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 4 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.