బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) ఇప్పుడు 4వ రోజున క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది…
మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 40% రేంజ్ లో డ్రాప్స్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ పుంజుకున్న సినిమా 4వ రోజును ఇప్పుడు సాలిడ్ గా పూర్తి చేసుకోబోతుంది. హిందీలో కూడా ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో బుకింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
14-15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో 14-15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ కేరళ కలిపి మరో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సొంతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో పెద్దగా సినిమా జోరు చూపించడం లేదు…
అక్కడ కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం ఓవరాల్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా 4వ రోజున సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 27-28కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక …
అంచనాలను మించిపోతే లెక్క 29-30 కోట్లు ఆ పైన వెళ్ళే అవకాశం ఉంది, ఓవరాల్ గా 4వ రోజు కలెక్షన్స్ పరంగా ఇవి ఎక్స్ లెంట్ హోల్డ్ అనే చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా ఓవరాల్ గా 4 రోజుల కలెక్షన్స్ పరంగా ఈ రేంజ్ లోనే వసూళ్ళని అందుకుంటుందో లేక అంచనాలను మించి పోతుందో చూడాలి ఇక…