బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాభాలను కూడా సొంతం చేసుకోవడం మొదలు పెట్టగా…. వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు…
వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఉందని చెప్పాలి… మొత్తం మీద డే 3 తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర…
4వ రోజున ఆల్ మోస్ట్ 60-65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపిస్తూ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా అటూ ఇటూగా 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా…
ఓవరాల్ గా సినిమా టోటల్ గా 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక గ్రాస్ పరంగా సినిమా 1.8-1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. సినిమా ఓవరాల్ గా 2.2 కోట్లు ఆ పైన గ్రాస్ ను అందుకుంటే ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు.