డీసెంట్ అంచనాల నడుమ ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన స్పై(SPY Movie) మరియు శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సామజవరగమనా (Samajavaragamana) సినిమాలు రెండూ కూడా మొదటి రోజు జోరు చూపించగా…
తర్వాత పాజిటివ్ టాక్ పవర్ తో సామజవరగమనా సినిమా సాలిడ్ జోరుని చూపిస్తూ మూడో రోజు రెట్టించిన జోరుతో సాలిడ్ గా దుమ్ము లేపింది. నిఖిల్ స్పై మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజులో ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి.
అదే టైంలో సామజవరగమనా సినిమా మరోసారి రెట్టించిన జోరు చూపించగా సినిమా 4వ రోజు మూడో రోజు కన్నా ఎక్కువగా జోరు చూపిస్తూ ఉండటంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.2 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల దాకా షేర్ ని…..
అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక స్పై మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు మరోసారి స్లో డౌన్ అవ్వగా ఈ రోజు అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని…
అందుకోవచ్చు. ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అదే టైంలో సామజవరగమనా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మరి ఈ అంచనాలను కూడా సినిమా మించిపోతుందో లేదో చూడాలి.