కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మొదటి రోజు పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత రోజుల్లో మిక్సుడ్ టాక్ తో డ్రాప్స్ కంటిన్యూగా సొంతం చేసుకుంటున్న సినిమా…
మూడో రోజున తమిళనాడులో పర్వాలేదు అనిపించినా మిగిలిన చోట్ల డ్రాప్స్ ఎక్కువగానే సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు నాలుగో రోజున సండే అడ్వాంటేజ్ ఉండగా ఒక్క తమిళనాడులో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చూపెడుతున్నా కూడా మిగిలిన చోట్ల…
మాత్రం డ్రాప్స్ కంటిన్యూ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా గ్రోత్ ని చూపించ లేక పోతూ ఉండగా ఓవరాల్ గా నాలుగో రోజున ఇక్కడ 30 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు…
ఇక సినిమా తమిళనాడులో ఈ రోజు మరోసారి 6-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా ఓవర్సీస్ లో కూడా ఈ రోజు హాల్ఫ్ మిలియన్ డాలర్స్ ని దాటే అవకాశం ఉంది.
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 4 వ రోజున 12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, గైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ లెక్కలు కొంచం పెరగవచ్చు, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 4 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.