బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ ఉగ్రం మరియు రామ బాణం రెండూ కూడా అనుకున్న రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోలేక పోయాయి. ఉన్నంతలో ఉగ్రం మూవీ బెటర్ టాక్ ని సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం టార్గెట్ ను అందుకునే దిశగా అయితే రన్ ని కొనసాగించలేదు… ఇక రామ బాణం కంప్లీట్ గా…
మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా ఇప్పుడు 2 సినిమాలు కూడా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు కూడా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి ఇప్పుడు… ఉగ్రం మూవీ ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకోగా రామ బాణం సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో 4వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 20 లక్షల నుండి 25 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక ఉగ్రం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 35 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉండగా రామ బాణం సినిమా 4వ రోజు 27 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక 2 సినిమాల 4 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.