బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగించిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(BRO The Avatar) సినిమా వీకెండ్ ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత…
ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా ఈ రోజు నుండి సాలిడ్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా….సినిమా మొత్తం మీద డే 4 మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 3వ రోజుతో పోల్చితే ఓవరాల్ గా 65-70% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొంచం గ్రోత్ ని అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా తెలుగు రాష్ట్రాల్లో…
మినిమమ్ 6 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఈ రోజున బాగా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎలా ఉంటాయి ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.