బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balalrishna) అనిల్ రావిపూడి(Anil Ravipudi) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా….
సినిమా ఓపెనింగ్స్ పరంగా అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేక పోయింది, అయినా కూడా సినిమా పాజిటివ్ టాక్ పవర్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుని మూడు వారాలలో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని బాలయ్య ఖాతాలో అఫీషియల్ గా హాట్రిక్ హిట్ గా నిలిచింది…
ఇక నాలుగో వారంలో అడుగు పెట్టిన సినిమాకి పోటిగా దీపావళి కి డబ్బింగ్ మూవీస్ భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా భగవంత్ కేసరి సినిమా 4వ వారంలో ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా మూడో వారంలో ఆల్ మోస్ట్ 300వరకు థియేటర్స్ ని…
హోల్డ్ చేసిన ఈ సినిమా… 4వ వారానికి వచ్చే సరికి నైజాంలో 40 థియేటర్స్ అలాగే సీడెడ్ లో 25వరకు థియేటర్స్ అలాగే ఆంధ్రలో 45 వరకు థియేటర్స్ ను అటూ ఇటూగా హోల్డ్ చేసినట్లు సమచారం. మొత్తం మీద 4వ వారంలో తెలుగు రాష్ట్రాల్లో 110 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా…
దీపావళి డబ్బింగ్ మూవీస్ ని తట్టుకుని మినిమం హోల్డ్ ని చూపించినా కూడా లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.