బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బిగ్ మూవీస్ వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాలు మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టాయి. సినిమాలు రెండూ కూడా మూడో వారంలో స్లో డౌన్ అవ్వడంతో 4వ వారం కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వీర సింహా రెడ్డి సినిమా చాలా థియేటర్స్ ని కోల్పోయింది ఇప్పుడు…
మొత్తం మీద ఇప్పుడు 4వ వారంలో నైజాం ఏరియాలో వీర సింహా రెడ్డి 10 థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా 40 థియేటర్స్ ని హోల్డ్ చేసింది. ఇక టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వీర సింహా రెడ్డి సినిమా ఇప్పుడు….
40 వరకు థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా సుమారు 90 థియేటర్స్ లో 4వ వారాన్ని కొనసాగిస్తుంది…3వ వారంతో పోల్చితే 4వ వారంలో రెండు సినిమాలు చాలా థియేటర్స్ ని కోల్పోయాయి. కొత్త సినిమాల రిజల్ట్ ను బట్టి తిరిగి కొద్ది వరకు థియేటర్స్ ని…
ఈ రెండు సినిమాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రెండు సినిమాల థియేట్రికల్ రన్ ఈ వీకెండ్ తర్వాత పూర్తిగా స్లో అయ్యే అవకాశం ఉండగా ఉన్నంతలో వాల్తేరు వీరయ్య కొంచం బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.