బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, తెలుగు రాష్ట్రాల్లో మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేదు కానీ, అదే టైంలో ఆల్ మోస్ట్ టాప్ స్టార్స్ నటించిన సినిమాల రేంజ్ లో సినిమా ఓవర్సీస్ లో కుమ్మేస్తుంది.
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఊహకందని రేంజ్ లో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న సరిపోదా శనివారం సినిమా ప్రీమియర్స్ నుండే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయగా ఇప్పుడు మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో అక్కడ 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది.
ఒకసారి సినిమా నార్త్ అమెరికాలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#SaripodhaaSanivaaram North America Collections
👉Premieres : $551K~
👉Day 1 : $318K~
👉Day 2 : $319K~
👉Day 3 : $355K~*****
Total Gross : $1.54M [12.90Cr~]
మొత్తం మీద సరిపోదా శనివారం అంచనాలను మించి అమెరికాలో మాస్ చేసి ఇప్పుడు 1.5 మిలియన్ మార్క్ ని దాటేసి నాని కెరీర్ లో నాలుగో సారి 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ భీభత్సం సృష్టించింది…కాగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా…
అత్యధిక సార్లు 1.5 మిలియన్ మార్క్ ని అందుకుని మాస్ రికార్డ్ ను నమోదు చేశాడు నాని…నాని నటించిన సినిమాల్లో జెర్సీ, దసరా, హాయ్ నాన్న సినిమాలు ఈ మార్క్ ని దాటగా ఇప్పుడు సరిపోదా శనివారం నాలుగో సారి ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…
అద్బుతంగా హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న సరిపోదా శనివారం ఇప్పుడు 2 మిలియన్ డాలర్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా సినిమా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అక్కడ అందుకోగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి.