మనతో పోల్చితే కోలివుడ్ లో టాప్ స్టార్స్ కొందరే ఉన్నారు, వాళ్ళలో కూడా సినిమా సినిమాకి రికార్డులు నెలకొల్పాలి అంటే మాత్రం కొందరికే సాధ్యం అని చెప్పాలి. రీసెంట్ టైంలో సీనియర్స్ ఫామ్ లో లేక పోవడం, టాప్ స్టార్స్ లో అజిత్ కుమార్(Ajith Kumar) సినిమాలు తక్కువగానే చేస్తూ ఉండటం, అలాగే తన మార్కెట్ కూడా లిమిటెడ్ గానే ఉండగా….
ఓవరాల్ గా కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ స్టార్ పవర్ మాత్రం ఒక్కడికే ఏర్పడింది…సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)….
రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకోగా ఇప్పుడు తమిళనాడులో విజయ్ పేరిట చరిత్ర కెక్కే రేంజ్ లో రికార్డ్ సొంతం అయ్యింది. తమిళనాడులో మొదటి రోజు టాప్ కలెక్షన్స్ పరంగా మరే హీరో కూడా విజయ్ దరిదాపుల్లో కూడా లేడు…
మొదటి రోజు తమిళనాడు లో 30 కోట్ల మార్క్ ని మరే హీరో ఇప్పటి వరకు అందుకోలేక పోయాడు, అదే టైంలో దళపతి విజయ్ మాత్రం ఏకంగా 4 సార్లు 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ని తమిళనాడులో అందుకుని సంచలనం సృష్టించాడు… ఒకసారి తమిళనాడులో టాప్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
Tamilnadu all time Top Day 1 Highest Grossing Movies
👉#Beast: 36.80CR
👉#LEO: 35.45CR
👉#Sarkar: 32CR
👉#TheGreatestOfAllTime – 31.65CR*****
👉#Valimai: 28.90CR
👉#PonniyanSelvan1: 26.85CR
👉#BIGIL: 26.50CR
మొత్తం మీద విజయ్ స్టార్ డం పవర్ ఏ రేంజ్ లో ఉందో ఈ లిస్టు చూస్తె అర్ధం చేసుకోవచ్చు. మిగిలిన స్టార్స్ ఇప్పటికీ 30 కోట్ల క్లబ్ లో చేరాల్సి ఉండగా మరో పక్క విజయ్ నాన్ స్టాప్ గా 30 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో రికార్డుల ఊచకోత సృష్టిస్తున్నాడు…. మరో ఫ్యూచర్ లో విజయ్ కాకుండా ఏ హీరో తమిళనాడులో 30 కోట్ల మార్క్ ని అందుకుంటాడో చూడాలి.