టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ను మొదలు పెట్టింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్…పోకిరి స్పెషల్ షో లతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత ప్రతీ హీరో ఫ్యాన్స్ కి చేరువ అయ్యి వరుస పెట్టి రీ రిలీజ్ ల ట్రెండ్ టాలీవుడ్ ను అన్ సీజన్ లో థియేటర్స్ లో కొంత ఫీడింగ్ కి యూస్ అవుతూ ఉండగా ఎప్పటికప్పుడు రీ రిలీజ్ మూవీస్ లో…
సంచలనాలు సృష్టిస్తున్న మహేష్ బాబు సినిమాలు ఓవరాల్ గా టాలీవుడ్ రీ రిలీజ్ లలో సరికొత్త రికార్డులతో దూసుకు పోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ సార్లు 5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క టాలీవుడ్ అండ్ సౌత్ హీరోగా మహేష్ బాబు…
ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు…బిజినెస్ మాన్ సినిమాతో మొదలైన ఈ జోరు తర్వాత మురారి సినిమా తో లాంగ్ రన్ రికార్డులు అందుకోగా ఈ ఇయర్ అయితే ఇప్పటికే 2 సార్లు 5 కోట్ల మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించాడు మహేష్ బాబు… టాలీవుడ్ లో అన్ సీజన్ గా భావించే…
మార్చ్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అంచనాలను మించిపోయి మరీ మాస్ రచ్చ చేసి లాంగ్ రన్ లో 5 కోట్ల మార్క్ ని అందుకోగా ఇప్పుడు లేటెస్ట్ గా ఖలేజా సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ బాబు..
మొదటి రోజే అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా తొలిరోజే 5 కోట్ల మార్క్ ని అవలీలగా అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో రీ రిలీజ్ లలో సరికొత్త రికార్డులను నమోదు చేయబోతుంది.
మహేష్ ఇక్కడితో ఆగిపోయేలా లేడు…ఈ ఇయర్ తన పుట్టిన రోజు టైంలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా అందరూ భావిస్తున్న అతడు సినిమాను రీ రిలీజ్ చేయబోతూ ఉండగా ఆ సినిమాతో మరిన్ని భీభత్సమైన రికార్డులు నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు…