బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోల్లో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)….కెరీర్ లో లోవేస్ట్ ఫేజ్ నుండి ఇప్పుడు కెరీర్ పీక్ టైం లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తున్న బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా రీసెంట్ గా 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. కాగా బాలయ్య కెరీర్ లో 4 సారి 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది డాకు మహారాజ్ మూవీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఇలా 70 కోట్ల షేర్ ని ఎక్కువ సార్లు అందుకున్న రికార్డ్ ఒక్క బాలయ్యకే సొంతం అవ్వగా…ఇక్కడ మరో భీభత్సమైన రికార్డ్ ఏంటంటే ఈ నాలుగు సార్లు 70 కోట్ల షేర్ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి 70 కోట్ల షేర్ మార్క్ ని కంటిన్యూగా అందుకోవడం….
అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి ఈ 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు నాలుగో మూవీగా డాకు మహారాజ్ మూవీ మాస్ భీభత్సం సృష్టించింది…సినిమా కి పోటిగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఊరమాస్ రాంపెజ్ ను…
చూపెడుతున్నప్పటికీ కూడా ఆడియన్స్ కి సెకెండ్ బెస్ట్ ఆప్షన్ గా డాకు మహారాజ్ నిలవడంతో లాంగ్ రన్ లో స్టడీగా జోరు కొనసాగిస్తే బాలయ్య కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఉంది. మరి సినిమా ఈ అంచనాలను ఎంతవరకు మించి పోతుందో చూడాలి ఇక…