రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఇప్పుడు 4 వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా…..సంక్రాంతికి వచ్చిన ఇతర సినిమాలు రన్ పరంగా ఆల్ మోస్ట్ స్లో డౌన్ అయిపోయినా కూడా….
సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఏమాత్రం జోరు తగ్గకుండా కుమ్మేస్తూ ఇప్పుడు నాలుగు వారాలను పూర్తి చేసుకుని ఊహకందని లాభాలను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. సినిమా ట్రెండ్ ఈ వీకెండ్ వరకు కూడా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి ఎట్టకేలకు ఇప్పుడు 28వ రోజున…
కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా మొత్తం మీద సాలిడ్ గా 4 వారాలను పూర్తి చేసుకుంది…28వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 28 లక్షల షేర్ ని 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 4 వారాల్లో ఇప్పుడు…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sankranthiki Vasthunam 28 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 42.28CR
👉Ceeded: 18.91CR
👉UA: 22.35CR
👉East: 13.69CR
👉West: 8.94CR
👉Guntur: 10.36CR
👉Krishna: 9.59CR
👉Nellore: 4.76CR
AP-TG Total:- 130.88CR(212.10CR~ Gross)
👉KA+ROI: 8.92Cr
👉OS – 16.92Cr****approx
Total WW Collections: 156.72CR(Gross- 270.70CR~)
ఓవరాల్ గా సినిమా 42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 114.22 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో స్లో అయినా కూడా ఇంకా ఎంతో కొంత లాభాలతో పరుగును ముగించే అవకాశం ఎంతైనా ఉంది…