బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో ధనుష్ నటించిన తెలుగు తమిళ్ బైలింగువల్ మూవీ సార్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి 4 వారాలను పూర్తీ చేసుకోగా సినిమా ధనుష్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ధనుష్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో పాటు ఇప్పుడు…
ఆల్ టైం ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా 4 వారాలలో టోటల్ గా 6.7 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 17 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా…
36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 26 కోట్ల లోపు ప్రాఫిట్ ను అందుకుని ఊచకోత కోసింది. ఇదంతా అన్ సీజన్ గా భావించే ఫిబ్రవరిలో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో…
రిలీజ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ రన్ పై ఎఫెక్ట్ అయినా కానీ ఇప్పుడు డిజిటల్ లో సంచలన వ్యూస్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది. ధనుష్ కి తెలుగు లో సూపర్ సాలిడ్ మార్కెట్ ని దక్కించు కోగా ఫ్యూచర్ లో చేసే సినిమాలతో ఇలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే తన మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.