బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ మొదట్లో అల వైకుంఠ పురంలో సినిమా టాలీవుడ్ లోనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ షేర్ ని సొంతం చేసుకుని సంచలన విజయాన్ని భారీ పోటి లో కూడా సొంతం చేసుకుంది. అలాంటి సెన్సేషనల్ విజయం తర్వాత అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, ఆ సినిమా తో పోల్చితే కంప్లీట్ గా కాంట్రాస్ట్ రోల్ లో ఫుల్ రగ్గుడ్ రోల్ తో దుమ్ము లేపగా…
పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర అల వైకుంఠ పురంలో సినిమా తో పోల్చితే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయినా కానీ 4 రోజులు పూర్తీ అయ్యే సరికి తెలుగు రాష్ట్రాలలో 59.9 కోట్ల షేర్ ని…
వరల్డ్ వైడ్ గా 94.44 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా 5 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను సొంతం చేసుకున్నా కానీ సినిమా డ్రాప్స్ ఉన్నప్పటికీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ ఉన్నా కానీ హిందీ లో మాత్రం సూపర్ సాలిడ్ గా సినిమా…
హోల్డ్ ని గ్రోత్ ని కూడా సొంతం చేసుకుందని చెప్పాలి. అలాగే కర్ణాటకలో అలాగే తమిళనాడులో సినిమా బాగానే హోల్డ్ చేస్తున్న కారణంగా ఈ రోజు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో సినిమా హిస్టారికల్ 100 కోట్ల షేర్ మార్క్ ని సొంతం చేసుకోబోతుంది. ఈ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా 100 కోట్ల మార్క్ ని 5 రోజుల్లో అందుకోవడం అంటే మామూలు ఊచకోత కాదనే చెప్పాలి. బాక్ టు బాక్ 2 సినిమాలతో అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని వరుసగా సొంతం చేసుకోవడం విశేషం. ఓవరాల్ గా సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా 5 రోజుల్లో రోజుకి యావరేజ్ గా 20 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం రికార్డ్ బ్రేకింగ్ అనే చెప్పాలి.