Home న్యూస్ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం….5 రోజుల్లో 100 కోట్లు…పండగ చేసుకుంటున్నారు!

బాక్స్ ఆఫీస్ ప్రభంజనం….5 రోజుల్లో 100 కోట్లు…పండగ చేసుకుంటున్నారు!

2615
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వేవ్ తర్వాత కానీ సెకెండ్ వేవ్ తర్వాత కానీ అన్ని ఇండస్ట్రీలు కూడా బాగా తెరుకున్నప్పటికీ కూడా ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ మట్టుకు ఒక్కటంటే ఒక్క నికార్సయిన హిట్ లేక పోవడంతో పూర్తిగా రేసులో వెనకబడింది. తిరిగి పరిస్థితులు ఎప్పుడు సెట్ అవుతాయా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న టైం లో థియేటర్స్ రీ ఓపెన్ అయినా మహారాష్ట్రలో ఓపెన్ అవ్వకపోవడంతో అక్షయ్ కుమార్ బెల్ బాటం….

రిలీజ్ అయినా కానీ ఆశించిన కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేదు, ఇలాంటి టైం దీపావళికి అన్ని చోట్లా థియేటర్స్ ని రీ ఓపెన్ చేయగా ఈ సారి ఆడియన్స్ ముందుకు మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ సూర్యవంశీ రిలీజ్ కి సిద్ధం అవ్వగా సినిమా ఎలా ఉంటుందో…

ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అన్న డౌట్స్ ఉండగా దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది…. మంచి టాక్ ని సొంతం చేసుకుని తొలిరోజు నుండే అంచనాలను మించుతూ పోయిన ఈ సినిమా వీకెండ్ కే…

ఆల్ మోస్ట్ 78 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 4 వ రోజు సోమవారం 13 కోట్ల నెట్ కలెక్షన్స్ తో 91 కోట్ల మార్క్ ని అందుకోగా 5 వ రోజు 11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని 102 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 5 రోజుల్లో సొంతం చేసుకుని సంచలన 100 కోట్ల తో దుమ్ము దుమారం లేపింది. వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో ఆల్ మోస్ట్ 145 కోట్లకు పైగా…

గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని దూసుకు పోతున్న ఈ సినిమా బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోసింది. అంతే కాకుండా అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్ కి కూడా కాన్ఫిడెంట్స్ ని పెంచింది అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ ని చూసి అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here