కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. సినిమా టాక్ ఇక్కడ కూడా యావరేజ్ లెవల్ లోనే ఉన్నప్పటికీ కూడా సినిమా పై ఉన్న క్రేజ్ వలన సెన్సేషనల్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ లో కూడా జోరు చూపుతూ దూసుకు పోతుంది.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మరో సారి కోటి రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖయామని భావించగా సినిమా అనుకున్నట్లుగానే ఆ మార్క్ ని అందుకుని…
రోజు ముగిసే సరికి టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది. ఒకసారి ఏరియాల వారిగా కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 24L
👉Ceeded: 23L
👉UA: 25L
👉East: 10L
👉West: 8L
👉Guntur: 10L
👉Krishna: 11.3L
👉Nellore: 5L
AP-TG Total:- 1.16CR (2Cr Gross~)
ఇక సినిమా మొత్తం మీద 5 రోజులు పూర్తీ చేసుకునే సమయానికి ఏకంగా 11.76 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని విజయ్ కెరీర్ లో తెలుగు లో హైయెస్ట్ షేర్ ని సాధించిన సినిమాగా నిలిచి విజిల్ సినిమా సాధించిన 11.56 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి సత్తా చాటుకుంది. ఇక సినిమా మొత్తం మీద 5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.08Cr
👉Ceeded: 2.23Cr
👉UA: 1.83Cr
👉East: 1Cr
👉West: 1.04Cr
👉Guntur: 1.15Cr
👉Krishna: 90L
👉Nellore: 53L
AP-TG Total:- 11.76CR (20.2Cr Gross~)
సినిమాను టోటల్ గా 8 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల తర్వాత మొత్తం మీద 3.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.